తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..డ్రగ్స్ (Drugs) విషయంలో చాల సీరియస్ గా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని పోలీసు అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం వైఫల్యం మూలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ బాగా పెరిగిందని..ఈ డ్రగ్స్ కు అలవాటు పడి ఎన్నో అఘాయిత్యాలు చేసారని , అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారని..ఇలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దని రేవంత్ అన్నారు. డ్రగ్స్ విషయంలో ఎక్కడ తగ్గొద్దని, ఎంతటివారినైనా వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు జారీచేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే విషయాన్నీ నగర సీపీ (CP) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నగర పోలీసులకు తెలిపారు. ముఖ్యంగా పబ్స్ (Pubs ) ఫై నిఘా పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో గత రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తొలిసారి స్నిఫర్ డాగ్స్ ఉపయోగించారు.
న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండడంతో సెలబ్రేషన్స్ కోసం పబ్‌లు సిద్ధమవుతున్నాయి. వేడుకల్లో మాదకద్రవ్యాలు, గంజాయి వంటివి విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని, పెద్ద ఎత్తున వాటి క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 10, 36, 45లోని పబ్‌లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలకు సంబంధించిన వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.
Read Also : Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
