Site icon HashtagU Telugu

Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్

Nalgonda Meeting

Nalgonda Meeting

Telangana: తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.

తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు నవంబర్ 13న నల్గొండలో ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. అయితే బీఆర్‌ఎస్ సమావేశానికి పోలీసుల అనుమతిపై విరుద్ధమైన నివేదికలు వెలువడ్డాయి. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలను నిషేధిస్తూ నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి పోలీసు చట్టం 1861లోని సెక్షన్ 30, 30 (ఎ)ని నెల రోజుల పాటు అమలు చేస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ సభకు అనుమతి మంజూరు చేశారు పోలీసులు.

నల్గొండలో కాంగ్రెస్ భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభ ద్వారా రూ. 500కే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈ రెండు హామీలను ప్రారంభించాలని యోచిస్తోంది. రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మరియు ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు.

బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. కృష్ణా నదిపై ప్రాజెక్టుల నియంత్రణను కేఆర్‌ఎంబీకి అప్పగించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా, అధికార పార్టీ అలాంటి చర్యలేవీ చేయలేదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అంగీకరించిందని తేల్చి చెప్పింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నల్గొండ కేంద్రంగా రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

Also Read: On This Day: పాకిస్థాన్ ని వణికించిన కుంబ్లే..ఇదే రోజు 10 వికెట్లు తీసి

Exit mobile version