Hyderabad: పార్థీ గ్యాంగ్‌పై పోలీసులు కాల్పులు

పార్థీ గ్యాంగ్‌ ఇటీవల వరుస దోపిడీలకు పాల్పడుతన్నది. అయితే సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్‌ పై కాల్పులు జరిపారు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: ఓఆర్ఆర్ పై ఈ రోజు హైడ్రామా చోటు చేసుకుంది. పార్థీ గ్యాంగ్‌ అని పిలవబడే రౌడీ గుంపును పట్టుకునేందుకు గత కొద్దిసరోజులు పోలీసులు ప్రయాత్నాలు చేస్తున్నారు. పార్థీ గ్యాంగ్‌ ఇటీవల వరుస దోపిడీలకు పాల్పడుతన్నది. అయితే సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్‌ పై కాల్పులు జరిపారు.

నల్గొండ సీసీఎస్ పోలీసులు వెంబడించడంతో హైదరాబాద్ శివార్లలోని అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఎదురుకాల్పులు జరిగాయి. పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు ముఠాను అడ్డుకుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఠా తిరగబడడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నల్గొండ పోలీసులు పార్థీ గ్యాంగ్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం నల్గొండకు తరలించారు.

Also Read: Honor 200: అద్భుతమైన ఫీచర్లతో లాంచింగ్ కి సిద్ధమవుతున్న హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్?

  Last Updated: 05 Jul 2024, 02:06 PM IST