Site icon HashtagU Telugu

Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు

Suman Police

Suman Police

.సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఫై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సుమన్ కోసం గాలింపు మొదలుపెట్టిన ఆయన జడ తెలియడం లేదు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో మరోసారి రాజకీయ పార్టీల మధ్య మాటల వార్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు సవాళ్లు , ప్రతిసవాళ్లు , ఆరోపణలు , ప్రతి ఆరోపణలు , విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ నువ్వా..నేనా అన్నట్లు వార్ జరిగింది. ఈ వార్ లో కాంగ్రెస్ విజయం సాధించగా..ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో మరోసారి వార్ కాకరేపుతుంది. గత ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..లోక్ సభ ఎన్నికల్లోనూ అలాగే విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వొద్దంటూ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా సీఎం రేవంత్ (CM Revanth Reddy)..కేసీఆర్ (KCR)ఫై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాళ్లు చేసారు. వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)..సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) తో రెచ్చిపోయారు. ‘పాగల్ గాడు, హౌ* గాడు. ఈ చెత్త నా కొ*ను చెప్పుతో కొట్టాలి. కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా KCRను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అంటూ రెచ్చిపోయారు. ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతగా చాలా మాట్లాడి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిగా.. పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ హితవు పలికారు. మంచిర్యాలలో పార్టీ జిల్లా సమీక్ష స్థాయి సమావేశంలో సుమన్ ఈ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారాయి. బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also : CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్