హైదరాబాద్ (Hyderabad) నందినగర్ (Nandhi Nagar) లోని కేటీఆర్ ఇంటి వద్ద (KTR HOuse) భారీగా పోలీసులు (Police Deployed) మోహరించారు. గ్రూప్-1 పరీక్ష (Group 1 Exam) కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. వారిని బయటికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్ ఫై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పరీక్షల సమయంలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.
ఇటు ఈరోజు నుండి 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్షలు (Group-1 Mains Exams) మొదలయ్యాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష హాలులోకి ఎంటర్ అయ్యే అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అభ్యర్థులు నిబంధనలను (Group 1 Candidates Rules) తప్పనిసరిగా పాటించాలి.అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కార్డును పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించకూడదు. హాల్ టికెట్‌పై అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం తప్పనిసరి. ఆన్సర్ రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.
Read Also : Malla Reddy : మనవరాలి పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి