Karimnagar : పోలీసులకు దొరికిన రూ.6.67 కోట్లు..BRS ఎంపీ అభ్యర్థివేనా..?

ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు

  • Written By:
  • Updated On - March 16, 2024 / 11:24 AM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో కరీంనగర్‌(Karimnagar)లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌ (Pratima Multiplex ) లో పెద్ద ఎత్తున డబ్బులు దాచారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మల్టీప్లెక్స్‌లో సోదాలు మొదలుపెట్టిన పోలీసులు.. శనివారం ఉదయం వరకు కొనసాగించారు. ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రతిమ మల్టీప్లెక్స్‌ కరీంనగర్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ (BRS MP Candidate Vinod Kumar) కుటుంబ సభ్యులకు చెందింది. దీంతో ఈ డబ్బు వినోద్ కు చెందిందే అని అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడం తో డబ్బు ను ఇక్కడ దాచారని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇక ఈ సోదాల్లో నగదు పట్టుబడటంతో సీపీ అభిషేక్‌ మహంతి అక్కడికి వెళ్లారు. పోలీసులు సీక్రెట్‌గానే ఈ తనిఖీలు చేశారు. ఇక డబ్బులను సీజ్ చేసినట్లుగా కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ధృవీకరించారు.

Read Also : Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణ పనుల కొత్త అప్‌డేట్స్