Revanth Reddy: నవంబర్ 30న తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు డబ్బు, బంగారం లాంటి వస్తువులపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి ముఖ్యనేతల కు చెందిన వాహనాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని సైతం పోలీసులు పరిశీలించారు.
కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ తర్వాత ఆయన కారును పూర్తిగా పరిశీలించారు. రేవంత్ రెడ్డి కూడా తనిఖీలకు పూర్తిగా సహకరించారు. కాగా ఎన్నికల సమరంలో సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్దమా అని, 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా అని అని అన్నారు.
Also Read: Sonia Gandhi: వాయు కాలుష్యం ఎఫెక్ట్, ఢిల్లీ నుంచి జైపూర్ కు సోనియాగాంధీ షిఫ్ట్!