Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే వ్య‌వ‌హారంపై తెలంగాణ హైకోర్టు పోలీసుల‌పై సీరియ‌స్ అయింది. ఒక వ్య‌క్తిని మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతుండ‌గా ప‌ట్టుకుంటే స‌ద‌రు వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని మ‌రోసారి స్పష్టం చేసింది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:22 AM IST

హైద‌రాబాద్‌-: న‌వంబ‌ర్ 6,2021 : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే వ్య‌వ‌హారంపై తెలంగాణ హైకోర్టు పోలీసుల‌పై సీరియ‌స్ అయింది. ఒక వ్య‌క్తిని మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతుండ‌గా ప‌ట్టుకుంటే స‌ద‌రు వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని మ‌రోసారి స్పష్టం చేసింది. ఈ విష‌యంపై దాఖ‌లైన 40 పిటీష‌న్ల‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ మేర‌కు తీర్పు ఇచ్చింది.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నం ప‌ట్టుకుంటే మొద‌ట‌గా వారి స‌న్నిహితుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని, ఎవ‌రూ స్పందించ‌ని, లేదా అందుబాటులోకి రానిప‌క్షంలోనే వాహ‌నాల‌ను జ‌ప్తు చేయాల‌ని చెప్పింది. త‌ర్వాత రోజు జ‌ప్తు చేసిన వాహ‌నాన్ని రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్ చూపించిన ప‌క్షంలో తిరిగి ఇచ్చేయాల‌ని సూచించింది.


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తిపై చార్జ్‌షీట్ దాఖ‌లు చేసి మూడ్రోజుల్లోగా మెజిస్ట్రేట్ ముందు ఖ‌చ్చితంగా హాజ‌రుప‌ర్చాల‌ని కూడా ధ‌ర్మాస‌నం పోలీసుల‌కు సూచించింది. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన పోలీసుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఉంద‌ని తెలిపింది.

Also Read : అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టాలు కావు

మ‌ద్యంసేవించి ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు ఉందా లేదా తెల‌పాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో 40 పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు మోటార్ వెహిక‌ల్ చ‌ట్టంలో ఇలాంటి అనుమ‌తులేవీ లేవ‌ని చెప్తూ ఈ మేర‌కు తీర్పు చెప్పింది.