Site icon HashtagU Telugu

Pocharam Srinivas Reddy : కాంగ్రెస్ లోకి పోచారం..?

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

తెలంగాణ లో బిఆర్ఎస్ (BRS) పార్టీ కి మరో షాక్ తగలబోతుందా..? అంటే అవునంటే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘోర ఓటమి తరువాత కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు రాజీనామా లు చేస్తూ కాంగ్రెస్ , బిజెపి పార్టీ లలో చేరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక నేతలంతా రాజీనామా చేసి కేసీఆర్ కు షాక్ ఇవ్వగా..ఇప్పుడు మరో కీలక నేత కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లడం ప్రాధన్యత తెచ్చింది. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 13మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోన్న వేళ పోచారంతో రేవంత్ భేటీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు పోచారం అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపినా కేసీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. నిజామాబాద్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి చరిష్మా నేత..తమ పార్టీ లో చేరితే బిఆర్ఎస్ మరింత ఉనికి కోల్పోవడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే మంత్రి పొంగులేటితో కలిసి ఉదయం పోచారం నివాసానికి సీఎం రేవంత్ వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బసవరాజ్ పటేల్ తెలిపారు. మంగళవారం బీర్కూరు మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ.. పోచారం కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా బీర్కూరు మండల నాయకులు తీర్మానం చేశారు. బీర్కూరు మండల నాయకుల వినతిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక పంపిస్తున్నట్లు వారు తెలిపారు. మరి ఇప్పుడు స్వయంగా రేవంత్ వెళ్లి పోచారాన్ని కలవడం తో బాన్సువాడ నియోజకవర్గంలో ఏంజరుగుతుందో అనే ఆసక్తి పెరిగింది.

Read Also : VVS Laxman: జింబాబ్వే టూర్‌కు గంభీర్‌ కోచ్‌ కాదట.. కోచ్‌గా మరో మాజీ ఆటగాడు..!