KTR: బీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు భారీ కుట్ర

బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్

KTR: బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జాతీయ పార్టలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టేందుకు సిద్దమయ్యాయని కేటీఆర్ అనడం ఆసక్తి రేపుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిసి. అయితే ఈ భేటీలోనే బీజేపీ. కాంగ్రెస్ కలిసి మా పార్టీని తుడిచిపెట్టడానికి పూనుకున్నాయని కేటీఆర్ అన్నారు. దానికి ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒకటేనని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అదానీని, మోదీని విమర్శించగా, దావోస్‌లో అదానీతో రేవంత్‌ పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారని విమర్శించారు కేటీఆర్.

తెలంగాణ సమస్యల కోసం పార్లమెంట్‌లో పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని, ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేందుకు రాబోయే ఎన్నికల్లో తప్పక గెలవాలని కేటీఆర్ నేతలకు సూచించారు. గతసారి మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. అయితే పార్టీ నేతల కృషితో ఈసారి విజయం సాధించవచ్చు అని అభిప్రాయపడ్డారు కేటీఆర్.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ పార్టీ గత తప్పిదాలు పునరావృతం కాబోవని కేటీఆర్ అన్నారు. పార్టీ గుర్తు కారు సర్వీసింగ్ కోసం వెళ్లినందున, అది మళ్లీ రెట్టింపు వేగంతో నడుస్తుందని పేర్కొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ కేవలం నాలుగు లక్షల ఓట్లు మాత్రమే అధికంగా సాధించిందని, మరో ఏడెనిమిది సీట్లు ఓడిపోతే రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడేదని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. బిఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు.

Also Read: Ayodhya : మీరు తప్పక తెలుసుకోవాల్సిన అయోధ్య రామాలయ విశేషాలు