Site icon HashtagU Telugu

CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెలువ‌.. ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోదీ ట్వీట్‌!

CM Revanth Reddy Birthday

CM Revanth Reddy Birthday

CM Revanth Reddy Birthday: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌ధాని మోదీ (CM Revanth Reddy Birthday) శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎక్స్‌ వేదికగా ప్ర‌ధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి, నిధులకు, భవిష్యత్ కార్యక్రమాలకు మద్ధతుగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఈ ట్వీట్ ప్ర‌త్యేకంగా నిలిచింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ష‌ర్మిల శుభాకాంక్ష‌లు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు విషెస్ చెప్పారు. రేవంత్ అన్న.. మీ కమిట్‌మెంట్, అంకితభావం, నాయకత్వ లక్షణాలు తమకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. మీ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో మరింత ముందుకు దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. మీ పాలనలో తెలంగాణ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్ర‌బాబు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేవుడు మీకు జీవితాంతం మంచి ఆరోగ్యం ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ CM రేవంత్‌రెడ్డికి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజా సేవలో మీరు ఆరోగ్యంగా ఉండాలి’’అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ విషెస్ చెప్పారు. రేవంత్ విజన్‌తో తెలంగాణ మరింత ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ రైతు మాత్రం వినూత్నంగా రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన పంట చేనులో రేవంత్ ముఖచిత్రం వచ్చేలా సాగు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Also Read: New-Gen Maruti Suzuki Dzire: కొత్త మారుతి డిజైర్ ఎంత మైలేజ్ ఇస్తుంది? లాంచ్‌కు ముందే వెల్ల‌డి!