Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని, తెలంగాణ అభివృద్ధికి తాము సహకరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతి, పౌరుల సంక్షేమానికి.. అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రధాని మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కాగా తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం కల్పిస్తూ రెండో సంతకం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగం కల్పిస్తానని దివ్యాంగురాలు రజినికి ఇదివరకే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చారు. దీంతో రజినీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.

రేవంత్ రెడ్డితో సహా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా రేవంత్ పగ్గాలు చేపడితే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేశారు. ఒక్కో మంత్రి ప్రమాణం స్వీకారం చేస్తుండగా, ఎల్బీ స్టేడియం హోరెత్తింది.

Also Read: CM Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. నారా లోకేశ్ ట్వీట్