PM Modi: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. అంతేకాక..కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని మోడీ సీఎం రెవంత్ రెడ్డికి తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. వరద ఉద్ధృతిపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించిన సీఎం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అమిత్ షాతో చెప్పారు. హోంమంత్రి అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.