నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్(Tunnel Collapse)లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ప్రధాని మోదీ ఆదేశించగా, పూర్తి స్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Shaktikanta Das : ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆర్బీబీ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను మరింత వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వీలైనంత త్వరగా రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
NEST : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై NEST దృష్టి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. బాధిత కార్మికులను సురక్షితంగా వెలికి తీయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా కాపాడేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.