Phone Tapping Case : ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన వ్యవహారంలో కీలక వివరాలు బయటికొస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన వ్యవహారంలో కీలక వివరాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను శనివారమే హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేయగా.. ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల (ఏప్రిల్​ 6 వరకు) రిమాండ్‌ విధించారు. దీంతో వారిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు భుజంగరావు పొలిటికల్‌ ఇంటెలీజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case)  ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉందని గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్‌ నోటీస్ జారీ చేశారు. శుక్రవారం రాత్రే ముగ్గురి నివాసాల్లో సోదాలు జరిపి అనంతరం విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారమంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే జరిగిందని విచారణలో తేలింది. ఈవిషయాన్ని వాంగ్మూలంలో ప్రణీత్‌రావు చెప్పాడు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటానికి ముందు జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ఫోన్​ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో గుర్తించారు.

Also Read : Maha Rally : 31న ఇండియా కూటమి ‘మహా ర్యాలీ’.. ఎక్కడో తెలుసా ?

  Last Updated: 24 Mar 2024, 03:00 PM IST