Phone Tapping Case: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు (Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ OSD ప్రభాకర్‌రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులు రద్దయ్యాయి. ఈ కేసులో కీలకమైన వీరిరువురూ దర్యాప్తును ఎదుర్కోకుండా అమెరికాలో తలదాచుకుంటున్నారని, వీరి పాస్‌పోర్టులు రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు గతంలోనే ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (RPO)కు నివేదిక పంపారు.
పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు రద్దు చేయాలని పాస్‌పోర్టు ఆఫీస్ కు సిటీ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ రావు పాస్ పోర్టును అధికారులు రద్దు చేశారు. నిందితుల పాస్ పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిటీ పోలీసులు పంపారు.
Also Read: Under Eye Mask : నల్లటి వలయాలను పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే అండర్ ఐ మాస్క్ ను ఇలా తయారు చేసుకోండి
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు పై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున దేశంలో ఏ ఎయిర్ పోర్టులో దిగిన హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వనున్నారు. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు కీలక పాత్ర పోషించారని అధికారులు భావిస్తున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారులు ఎవరనేది బయటపడనుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు సైతం సవాళ్లు విసురుతున్నారు.