Pesticides In Food : ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. ఏ విషయంలోనూ అతి మంచిది కాదు. ఇటీవల కాలంలో పంటలపై అవసరానికి మించిన మోతాదులో క్రిమి సంహారకాల(పెస్టిసైడ్స్)ను పిచికారీ చేస్తున్నారట. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి అపాయం కలుగుతుంది. ఎందుకంటే.. పంటలపై పిచికారీ చేసే పెస్టిసైడ్స్, అగ్రో కెమికల్స్‌లో సగటున 10 శాతమే పంటలోని పురుగులు, తెగుళ్ల నివారణకు పనిచేస్తుంది. మిగతా దానిలో కొంత గాలిలో కలిసిపోతుంది. ఇంకొంత భూమిపై పడుతుంది. మరికొంత నీళ్లలో కలుస్తుంది. ఇంకొంత మోతాదులో పెస్టిసైడ్స్ నేరుగా ఆ పంట ఉత్పత్తుల లోపలికి ఇంకిపోతాయి.
Also Read :Prisoners Salary: జైలు సిబ్బంది కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారట.. ఎలా ?
తదుపరిగా వాటిని మనుషులు తింటారు ఆ రకంగా మనుషుల శరీరంలోకి అగ్రో పెస్టిసైడ్స్, కెమికల్స్ చేరుతున్నాయి. అవి శరీరంలోకి ప్రవేశించాక సైలెంటుగా పనిని మొదలుపెట్టి.. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తున్నాయి. చివరకు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించేస్తున్నాయి. పశువులకు వేసే పచ్చిగడ్డిలో కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. వాటిని తిన్న గేదెలు, ఆవులు ఇచ్చే పాలలో కూడా ఆ పెస్టిసైడ్స్ మూలాలు కనిపిస్తున్నాయి. అవే పాలను మనుషులు తాగుతున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు తల్లిపాలలో సైతం పెస్టిసైడ్స్ మూలాలు ఉన్నట్లు ఇటీవలే పలు అధ్యయనాల్లో గుర్తించారు.
తెలంగాణ, ఏపీలలో డేంజర్ బెల్స్
మన దేశంలో పురుగుమందుల వినియోగంలో పంజాబ్, హర్యానా తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే ఉన్నాయి.తెలంగాణలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లోని 490 మంది రైతులపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), ఉస్మానియా బయోకెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవలే అధ్యయనం చేశారు. 341 మంది రైతుల రక్తంలో, మూత్రంలో 11 రకాల హానికారక పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని టెస్టింగ్ రిపోర్టుల్లో తేలింది. పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల రైతుల(Pesticides In Food) శరీరంలోకి పురుగు మందులు చేరినట్లు గుర్తించారు.
Also Read :NTR First Remuneration : ఎన్‌టీఆర్‌కు సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది ? తొలి రెమ్యునరేషన్ ఎంత ?
పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయన్నది నిజం. వాటిలోనే పురుగు మందులు, రసాయనాలు కూడా ఉంటాయన్నది కూడా నిజమే. ఎందుకంటే అధిక పంటల దిగుబడి, చీడపీడల నివారణ కోసం రైతన్నలు పెస్టిసైడ్స్, కెమికల్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వివిధ రకాల కెమికల్స్ కలిసి ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలామందిలో క్యాన్సర్లు, అల్జీమర్స్, శ్వాస సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలు వస్తున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ వల్ల పురుషుల లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటోందట.