Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ప్రజల సమస్యలు , ఆరోగ్యం..సీఎం రేవంత్ కు అవసరం లేదా..?

Cm Revanth Reddy (10)

Cm Revanth Reddy (10)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు (Dengue fever) విజృభిస్తున్నాయి. పల్లె , పట్టణం అనే తేడాలు లేకుండా ప్రతి ఇంట్లో సగం వరకు డెంగ్యూ తో బాధపడుతున్నారు. హాస్పటల్స్ అన్ని కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రవైట్ హాస్పటల్స్ లలో ఫీజులు కట్టలేక..ప్రభుత్వ హాస్పటల్స్ కు క్యూ కడుతున్నారు. కానీ అక్కడ వైద్య సిబ్బంది కొరత..టెస్ట్ లు చేసిన రిజల్ట్ రావడానికి రెండు రోజుల సమయం పడుతుండడం..ఆ లోపు రోగుల జ్వరం ఎక్కువ అవుతుండడం తో చాలామంది డబ్బులు పోతేపోనీ అని ప్రవైట్ హాస్పటల్ లలో చూయించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాత్రం దీనిపై ఫోకస్ చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీ ఫై , ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలపై ఫోకస్ చేస్తున్నారు తప్ప..రాష్ట్ర ప్రజలంతా అనేక సమస్యలతో బాధపడుతున్నారు..వాటి ఫై ఫోకస్ చేసి సమస్యలను తీరుద్దామని ఏమాత్రం ఆలోచన చేయడం లేదని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక గ్రేటర్ వాసులైతే సీఎం ఫై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత నాల్గు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నగరం అతలాకుతలం అవుతుంది. ఎక్క‌డ డ్రైనేజీ పొంగుతుందో… ఎక్క‌డ నీరు ఆగిపోయిందో తెలియడం లేదు. ఇదే క్రమంలో డెంగ్యూ కేసులు ఎక్కువుతున్నాయి. మ‌ర‌ణాలు అంతే స్థాయిలో ఉంటున్నాయి. గత 20రోజుల్లో హైద‌రాబాద్ లో జ్వ‌రాలు, డెంగ్యూ స‌హ ఇత‌ర కేసుల సంఖ్య 30శాతం పెరిగింది. దోమ‌ల నివార‌ణ‌కు ప‌క్కాగా ప్రణాళిక‌లు లేక‌పోవ‌టం, ఉన్నా అమ‌లుకు నోచుకోక‌పోవ‌టం ఇబ్బందిక‌రంగా మారింది. రాష్ట్రంలో గ‌తంలో ఏక‌కాలంలో జ్వ‌ర స‌ర్వే చేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏవీ క‌న‌ప‌డ‌టం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గ‌రే మున్సిప‌ల్ శాఖ ఉన్నా… రివ్యూ లేదు. ఆరోగ్య శాఖ మంత్రి చ‌ర్య‌లు అంతంతే. ఇలా ఎటు చూసిన నిర్లక్ష్యం కనిపిస్తుంది తప్ప..ఆచరణ లేదు. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు. మీ రాజకీయాలు..రాజకీయ గొడవలు పక్కన పెట్టి ప్రజల సమస్యల ఫై ఫోకస్ చెయ్యండి అంటూ ప్రజలు అధికార , ప్రతిపక్ష పార్టీలను కోరుకుంటున్నారు.

Read Also : Jagan : విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి – CBI కోర్ట్ కు జగన్ వినతి