Congress : పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్

Congress : స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.

Published By: HashtagU Telugu Desk
Adani should be arrested immediately: PCC president Mahesh

Adani should be arrested immediately: PCC president Mahesh

Mahesh Kumar Goud : మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘి స్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత తగాదాల పట్ల పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.

క్షేత్ర స్థాయిలో మరింత విస్తృతంగా పని చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ విజయాల కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. నియోజక వర్గ ఇంచార్జ్ లు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. ప్రజలకు, పాలనా యంత్రాంగానికి మధ్య పార్టీ నాయకత్వం వారధిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. స్ధానికంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు.

Read Also: CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ ముందడుగు వేసింది: సీఎం రేవంత్‌ రెడ్డి

  Last Updated: 15 Oct 2024, 03:16 PM IST