Oke Okkadu : సీఎం రేవంత్ పై పుస్తకం.. టైటిల్ ‘ఒకే ఒక్కడు’

Oke Okkadu : ఈ పుస్తకాన్ని వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రచించారు. ఈ పుస్తకాన్ని TPCC మహేష్ కుమార్ ఆవిష్కరించి..పుస్తకాన్ని రచించిన వారిని ప్రత్యేక అభినందించారు

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Oke Okkadu

Cm Revanth Oke Okkadu

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురించి రాసిన ఒకే ఒక్కడు (Oke Okkadu) పుస్తకాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar) ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రచించారు. ఈ పుస్తకాన్ని TPCC మహేష్ కుమార్ ఆవిష్కరించి..పుస్తకాన్ని రచించిన వారిని ప్రత్యేక అభినందించారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, అతని ఉద్యమపూర్వక జీవితాన్ని కొనియాడారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో సాహసోపేతంగా నిలబడిన రేవంత్ రెడ్డి..ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో నిర్బంధాలకు ఎదురు నిలబడిన నాయకుడిగా ఉన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో నిర్బంధానికి గురైన ప్రజల కోసం పోరాడుతూ, నిరంతరం ప్రజాస్వామ్య స్థాపన కోసం కృషి చేస్తున్నారన్నారు.

రేపు (శుక్రవారం) రేవంత్ రెడ్డి పుట్టినరోజు (CM Revanth Reddy Birthday) సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖంగా, ప్రజల సేవలో ఎన్నో విజయాలను అందుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదలకు సహాయం, ఉచిత ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

Read Also : Reddappagari Madhavi Reddy : కడప మాధవీరెడ్డి కనుసైగ చూసి వణుకుతున్న వైసీపీ నేతలు

  Last Updated: 07 Nov 2024, 04:45 PM IST