Site icon HashtagU Telugu

Pawan Kalyan : పరీక్ష పేపర్ లీక్స్ తో లక్షలమంది నిరుద్యోగులు నష్టపోయారు – పవన్ కళ్యాణ్

Pawan Kdm

Pawan Kdm

తెలంగాణ ఎన్నికల ప్రచారం(Election Campaign )లో భాగంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్తగూడెం (Kothagudem) సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై పరోక్షంగా విమర్శలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బిజెపి (BJP) తో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన (Janasena) పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. ఈ తరుణంలో నిన్న బుధువారం నుండి పవన్ (Pawan Kalyan) ప్రచారంలోకి అడుగుపెట్టారు. వరంగల్ లో జరిగిన సభలో పవన్ పాల్గొని తాను బిజెపి కి మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటో వివరించారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం అయిందనీ.. తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు కొత్తగూడెం సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడతూ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీరోజూ ఎన్నికల లాగానే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస పరీక్ష పేపర్ లీక్స్ తో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని.. తల్లిదండ్రులను వదిలి..హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లలో కోచింగ్ తీసుకొని ఎంతో కష్టపడ్డారని..కానీ తీరా పరీక్షా రాస్తే..అవి కాస్త లీక్ అవ్వడం వారిని జీవితాలను అయోమయం చేశాయని ఆవేదన వ్యక్తం చేసారు. 2014లో మోడీని కలిసి, దక్షిణ భారతంలో ఎవరు ఉన్నా.. లేకున్నా.. తాను అండగా ఉంటానని చెప్పానన్నారు. తనకు అన్ని పార్టీల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయని… కానీ, స్నేహం వేరు.. రాజకీయాలు వేరని… అవినీతిపై పోరాడే వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తిరిగానని.. తెలంగాణలో ఉన్న పోరాట స్పూర్తి.. దేశం మొత్తం ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయేదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయన్నారు. జిల్లాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కౌలు రైతుల్ని చులకనగా చూడొద్దన్నారు. గత పాలకులు చేసిన తప్పే తిరిగి తెలంగాణలో పునరావృతం అవుతోందన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా బీజేపికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Read Also : KCR : కేసీఆర్ నువ్వు బక్కోడివి కాదు.. బకాసురుడివి – దుబ్బాకలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు