Site icon HashtagU Telugu

Health On Us app : ‘హెల్త్‌ ఆన్‌ అస్‌’ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

Health On Us App

Health On Us App

కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అన్నారు. హైదరాబాద్ లో ఆదివారం ‘హెల్త్ ఆన్ అజ్’ (Health On Us app) మొబైల్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోంది. కొవిడ్ తర్వాత ఇంటి వద్దే మెడికల్ కేర్ కావాలనుకుంటున్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, వైద్యులను మన ఇంటికే తీసుకొస్తుంది. ఇలాంటి యాప్లతో ఉపాధి కూడా దొరుకుతుంది. వైద్య విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అందరూ బాగుండాలి .. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకర్ని నని, సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని చెప్పుకొచ్చారు. ‘హెల్త్‌ ఆన్‌ అస్‌’ యాప్‌ వెనుక ఎంతో కృషి ఉందని.. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్‌ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కోరారు. మొదటి సారి మెడికల్ కేర్ కు సంబంధించిన ఈవెంట్ కు వచ్చానని అన్నారు. చాలా మంది డాక్టర్స్ చదువుతున్నారు కానీ డాక్టర్స్ కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. కొన్ని సార్లు హాస్పిటల్ లో బెడ్ కావాలంటే మంత్రుల రికమండేషన్ కావాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also : KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు