భారీ వర్షాలు , వరదలతో నష్టపోయిన తెలంగాణ కు సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆర్ధిక సాయం ప్రకటించారు. విపత్తు సమయంలో తెలంగాణ(Telangana)కు తన వంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని పేర్కొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అలాగే ఏపీకి కూడా కోటి రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే సీఎంకు అందజేస్తానని , గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో లోపం జరిగిందన్నారు . 253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45 వేల మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు. ఇక ఏడు పదుల వయస్సులోనూ సీఎం చంద్రబాబు సహాయక చర్యల్లో పాల్గొంటున్నా వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని పవన్ దుయ్యబట్టారు. తాను బయటకు వస్తే అధికార యంత్రాంగానికి ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పే వెళ్ళలేదు తప్ప మరోటి కాదని క్లారిటీ ఇచ్చారు. దశాబ్దాలుగా బుడమేరు 90 శాతం ఆక్రమణకు గురైందని అన్నారు. అనేక సవాళ్ల మధ్య అధికారాన్ని చేపట్టామని ఈ సమయంలో విమర్శలు మాని అందరు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
Read Also : Hydra : ‘హైడ్రా’ పేరు చెప్పి డబ్బుల వసూళ్ల కు పాల్పడితే జైలుకే – హైడ్రా కమిషనర్