Hyderabad : హైదరాబాద్ పోలింగ్ శాతంఫై పవన్ ఆగ్రహం

హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరమన్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Telangana Camp

Pawan Kalyan Telangana Camp

గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ (Telangana Polling ) జరిగింది..ఈసారి కూడా పల్లెల్లో ఓటింగ్ శాతం పెరుగగా..గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad)మాత్రం ఎప్పటిలాగే పోలింగ్ శాతం (Polling Percentage) తగ్గింది. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం తో పాటు సినీ ప్రముఖులు అవగాహన కల్పించినా.. గ్రేటర్‌ ఓటరు తీరు మాత్రం మారలేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్‌ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓటర్లు మినహా నగరంలో యువకులు, విజ్ఞానవంతులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్‌ శాతం మాత్రం పెరగలేదు.

దీనిపై యావత్ మీడియా తో పాటు పలు రాజకీయ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..హైదరాబాద్ పోలింగ్ శాతం స్పందించారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరమన్నారు. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు. కూకట్ పల్లిలో నిర్వహించిన సభలో యువత భారీగా తరలివచ్చారని పవన్ చెప్పారు. యువత అనేది రాష్ట్రానికి భవిష్యత్ లాంటిదని.. జనసేన పార్టీలో అలాంటి యువత ఉన్నారన్నారు. యువతకి మంచి భవిష్యత్ ఉండాలని జనసేన ఎప్పుడూ కోరుకుంటుందని పవన్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక హైదరాబాద్ లో పోలింగ్ శాతం (Hyderabad Polling Percentage) చూస్తే..

చాంద్రాయణగట్ట లో 24.6%

యాకుత్ పురా లో 20.09%

బహదూర్ పురా లో 30.41%

సికింద్రాబాద్ లో 36.31%

కంటోన్మెంట్ లో 37.81%

ఖైరతాబాద్ లో 37%

జూబ్లీ హిల్స్ లో 35.3 %

సనత్ నగర్ లో 39.27%

నాంపల్లి లో 22.7%

కర్వాన్ లో 32.4%

ముషీరాబాద్ లో 27.98%

మలక్ పేట్ లో 29.16%

అంబర్ పెట్ లో 34.3 %

గోషామహల్ లో 35 %

చార్మినార్ లో 29.83% పోలింగ్ నమోదు అయింది.

Read Also : Accident : మహిళ ప్రాణాలు తీసిన ఎక్సైజ్ సీఐ కుమారుడు

  Last Updated: 01 Dec 2023, 06:18 PM IST