కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) కి బస్సు ప్రయాణికులు భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మాములుగా ఫ్రీ గా వస్తుందంటే ఏది వదలని ప్రజలు..ఫ్రీ గా రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయొచ్చు అంటే ఊరుకుంటారా..? పని ఉన్న లేకపోయినా బస్సుల్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎక్కడ చూసిన బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బస్ స్టాండ్ లో బస్సు ఆగడమే ఆలస్యం సిటు కోసం పరుగులుపెడుతున్నారు. అంతే ఎందుకు సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సు స్కిం పట్ల తిట్టనివారు లేరు. ఇప్పుడు దసరా సీజన్ కావడం తో కనీసం బస్సుల్లో కాలుపెట్టే సందు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ టైం లో ఫ్రీ బస్సు సౌకర్యం ఎలా ఉందంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రయాణికులను అడగడం తో కొట్టడమే తక్కువ అన్నట్లు ప్రయాణికులు సమాధానం ఇచ్చారు.
మునుగోడులో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించారు. అదే సమయంలో చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్‌కు రావడంతో ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని మహిళలను ఎమ్మెల్యే పలకరించారు. ‘ఫ్రీ బస్ సంతోషంగా ఉందా? టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా?’ అని మహిళా ప్రయాణికులను అడిగారు. దానికి ఓ మహిళ స్పందిస్తూ ‘ఏం సంతోషం సార్. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా? ఎప్పుడో ఒకసారి వెళతాం. టికెట్ తీసుకున్నవాళ్లేమో నిలబడుతున్నారు. మేం మాత్రం కూర్చుంటున్నాం’ అని సమాధానం చెప్పింది. మరో మహిళా ఫ్రీ బస్సు పెట్టిన దగ్గరి నుండి ఇబ్బంది పడుతున్నామని..సీటు కోసం కొట్టుకోవాల్సి వస్తుందని…ఫ్రీ బస్సు లేనప్పుడే సంతోషంగా ప్రయాణం చేసేవారమని చెప్పి షాక్ ఇచ్చింది.
Read Also : Bobby Deol : యానిమల్ విలన్ డిమాండ్ బాగుందిగా..?
