Passenger Trains : పేద ప్రజలు చౌకగా ప్రయాణం చేసే ప్యాసింజర్ రైళ్లు తిరిగి వచ్చాయి. కరోనా టైంలో ఈ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాటిని రైల్వేశాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వీటికి పాత ఛార్జీలనే వసూలు చేయనున్నారు. దీంతో కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వరకు పుష్‌పుల్ ప్యాసింజరు రైలులో రూ.30కే ప్రయాణించే ఛాన్స్ లభించింది. కరోనా టైం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ ప్యాసింజర్ రైళ్లకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీలనే వసూలు చేశారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ ఫుల్ రైలులో ప్రయాణిస్తే ఛార్జీ రూ.30గా ఉండేది. కరోనా తర్వాత దాన్ని రూ.60కి పెంచారు. సామాన్యులు, చిరు వ్యాపారులకు (Passenger Trains) దీనివల్ల ఎంతో ఇబ్బందిగా ఉండేది. అయితే ఫిబ్రవరి 27 నుంచి ఛార్జీగా రూ.30 తీసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంతో వాటిలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్, విజయవాడ, సిర్‌పూర్ కాగజ్‌నగర్‌కు ప్యాసింజరు రైళ్లలో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కాజీపేట నుంచి 165 కిలోమీటర్ల దూరంలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ఇది వరకు ఎక్స్‌ప్రెస్ ఛార్జి రూ.80 ఉండేది. ఇప్పుడు రూ. 35లకే వెళ్లే అవకాశం ఉంది. భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్‌కు కేవలం రూ.30లతో సింగరేణి ప్యాసింజర్‌లో ప్రయాణం చేయొచ్చు. ఇందులో ఇది వరకు టికెట్ ధర రూ.75 ఉండేది.
Also Read :Acid Attack : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి.. యువకుడి దుశ్చర్య
ప్యాసింజరు రైలులో కనిష్ఠ ఛార్జి రూ.5 చేశారు. మొదటి మూడు రైల్వేస్టేషన్ల వరకు ఇదే ఛార్జీ ఉంటుంది. కాజీపేట నుంచి జమ్మికుంటకు రూ.10 అవుతుంది. కాజీపేట నుంచి బస్సులో జమ్మికుంటకు వెళ్లాలంటే రూ.120 అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పాల వ్యాపారులు, హైదరాబాద్‌లోని మాల్స్‌లో పనిచేసే కార్మికులకు ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సికింద్రాబాదు నుంచి కాగజ్‌నగర్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.. కాజీపేట- కాగజ్‌నగర్‌ల మధ్య ప్యాసింజర్ రైలుగా నడవనుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రం ఎక్స్‌ప్రెస్ రైలుగా నడుస్తుంది.