Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన

వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవ‌ర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బ‌స్టాండ్‌లో బ‌స్సును ఆపాడు

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 01:08 PM IST

తెలంగాణ (Telangana) లో ప్రతి రోజు ఆర్టీసీ సిబ్బంది (RTC Staff) ఫై ప్రయాణికుల దాడి లేదనే ఆటో డ్రైవర్ల దాడి (ATTCK) అనేది ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు , పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం ఆగడం లేదు. లేడి కండక్టర్ అనేది కూడా చూడకుండా బూతులు తిట్టడం లేదా..వారిపై దాడులు చేయడం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ (Vikarabad) డిపో కి చెందిన రాములు అనే డ్రైవర్ ఫై ప్రయాణికుడు నవాజ్ దాడి చేయడం తో డ్రైవర్లంతా నిరసనకు దిగారు. సదరు ప్రయాణికుడి ఫై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బస్సులన్నీ డిపోకే పరిమితం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఏంజరిగిందంటే..

వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవ‌ర్ రాములు (Driver Ramulu).. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బ‌స్టాండ్‌లో బ‌స్సును ఆపాడు. బ‌స్సులోనే కండక్ట‌ర్, డ్రైవ‌ర్ క‌లిసి టిఫిన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో న‌వాజ్ అనే ప్ర‌యాణికుడు వ‌చ్చి బ‌స్సు ఆల‌స్యంపై ప్ర‌శ్నించాడు. టిఫిన్ చేస్తున్నాం.. ఐదు నిమిషాల్లో బ‌య‌ల్దేరుతుంద‌ని రాములు చెప్పాడు. రాములు చెపుతుండగానే.. న‌వాజ్.. డ్రైవ‌ర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవ‌ర్లంతా క‌లిసి దాదాపు 45 బ‌స్సుల‌ను నిలిపేశారు. డ్రైవ‌ర్ రాములుపై దాడి చేసిన న‌వాజ్‌ను అరెస్టు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. న‌వాజ్‌పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బ‌స్సుల నిలిపివేత‌తో ప‌రిగి, తాండూరు, హైద‌రాబాద్ వెళ్లే ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ ఘటన ఫై ఆర్టీసీ అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఎండలు దంచికొడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు..ప్రయాణికులకు ఇబ్బంది కలగవద్దని బస్సులు నడుపుతున్నారని..అయినప్పటికీ ప్రయాణికులు ఏమాత్రం అర్ధం చేసుకోకుండా దాడులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

Read Also : Hyderabad: హైదరాబాద్​లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం