Sigachi Blast : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు ఇప్పటికే 36 మంది మృతి చెందినట్లు ప్రకటించగా, పటాన్ చెరు ఆసుపత్రి మార్చురీకి 39 మృతదేహాలు వచ్చాయని సమాచారం. కాగా, మరో 13 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాలు కన్నీటి మునిగిపోతున్నాయి.
Cine Awards : సినీ అవార్డ్స్ అవి చూసే ఇస్తారంటూ జయసుధ సంచలన వ్యాఖ్యలు
సహాయక చర్యల మధ్య గందరగోళ లెక్కలు
ఈ దుర్ఘటనకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో గందరగోళం కొనసాగుతోంది. సిగాచి యాజమాన్యం ప్రకారం ప్రమాద సమయంలో డ్యూటీలో 162 మంది కార్మికులు ఉన్నట్టు తెలిపింది. అయితే, అధికారుల లెక్కల ప్రకారం 143 మందే పనిచేస్తున్నట్టు తేలింది.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం:
- 57 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు
- 34 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు
- 16 మంది ఆచూకీ తెలియరాలేదు
- ఇప్పటివరకు 36 మంది మృతదేహాలు గుర్తించారు
అయితే, ఆసుపత్రికి 39 మృతదేహాలు చేరినట్లు ఉండటంతో కంపెనీ లెక్కలు, అధికారుల లెక్కల మధ్య 19 మందికి తేడా కనిపిస్తోంది. దీనివల్ల మిగిలిన వారేంటో, ఎంత మంది గల్లంతయ్యారో స్పష్టత లేక బాధిత కుటుంబాలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి.
ఇక.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీయేందుకు రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నారు. క్రేన్లు, ప్రొక్లెయిన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. అయితే, ఎలాగైనా మిగిలిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Heart Attack : కరోనా వాక్సిన్ వల్లే గుండెపోటులు ఎక్కువగా సంభవిస్తున్నాయా..? ICMR-AIIMS క్లారిటీ