Site icon HashtagU Telugu

TG : పంచాయతీ ఎన్నికలు..ఓటరు జాబితా తయరీకి షెడ్యూల్‌ విడుదల

1111

Panchayat Elections..Schedule Released for Preparation of Voter List

Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇటివల మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు.

Read Also: Atchutapuram : రియాక్టర్ పేలుడు.. 6 కు చేరిన మృతుల సంఖ్య