దళిత బంధు (Dalitha Bandhu) రెండో విడత విడుదల చేయాలంటూ హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలపెట్టిన ధర్నా ఉద్రికక్తతకు దారితీసింది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునేక్రమంలో కార్యకర్తలకు , పోలీసులకు మధ్య తోపులాట జరగడం తో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గాయాలు అయ్యాయి. దళిత బంధు (Dalit Bandhu) పథకం గత సీఎం కేసీఆర్.. 2021లో ప్రారంభించారు. ఈ పథకం ఉద్దేశ్యం దళితులకు ఆర్థిక, సామాజిక మరియు విద్యా రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, మరియు వారిని ఆధునిక ఉత్పత్తి వ్యవస్థలతో అనుసంధానం చేయడం. ఈ పథకం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ నిధులను ఉపయోగించి దళిత కుటుంబాలు స్వయం ఉపాధి స్థాపనకు, వ్యాపారాలు ప్రారంభించడానికి, లేదా ఇతర ఆర్థిక కార్యాచరణల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
కాగా ఈ పథకానికి సంబదించిన రెండో విడతను విడుదల చేయాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ..అధికార పార్టీ కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఈరోజు హుజురాబాద్ లో ధర్నాకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్(BRS) నేతలతో ధర్నా(protest)కు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కౌశిక్ ను అడ్డుకున్నారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నేతలు హుజురాబాద్(Huzurabad) చౌరస్తా కు చేరుకోవడంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎన్ నేతల మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ పోలీసులు కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా పోలీసులు ఆయనను బలవంతంగా కారులోకి కుక్కడంతో.. ఊపిరి ఆడకపోవడం తో ఆయన కారులో.. విలవిలలాడి నట్లు ఓ వీడియోలో కనిపించింది. సృహ తప్పి పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతాని కౌశిక్ రెడ్డి అన్నారు. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీ ఛార్జ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.