Site icon HashtagU Telugu

Asaduddin Owaisi: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటైన విమర్శలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: హైదరాబాద్‌ దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ మహిళల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఇలాంటి సూచనలు చేయడం పూర్తిగా అనవసరమని, ఇది మహిళలపై అదనపు భారం మోపే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు. “ముగ్గురు పిల్లలు ఉంటే కుటుంబ బంధాలు బలపడతాయన్న మోహన్‌ భాగవత్ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉంది. భారాన్ని మోసేది మహిళలే కదా… అలాంటప్పుడు వారిపైనే ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు? ప్రజల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటానికి ఆయనకు ఎలాంటి అధికారం ఉంది?” అని ఒవైసీ ప్రశ్నించారు.

Kotamreddy Sridhar Reddy : TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర?

ఇక ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ముస్లింలపై శత్రుత్వం క్రమంగా పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని అనుబంధ సంస్థలు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జనాభా పెరుగుదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాస్తవాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆయన తేల్చిచెప్పారు. 2011 జనాభా లెక్కలను ఉదాహరణగా చూపుతూ, దేశ జనాభాలో హిందువులు 80 శాతం ఉన్నారని, ముస్లింలు కేవలం 14.23 శాతం మాత్రమే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ మైనారిటీలపై తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఒవైసీ అన్నారు. “ప్రజల వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధం” అని ఆయన స్పష్టం చేశారు.

Healthy Breakfast: షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఫుడ్ ఇదే!