Missile Capital : భారతదేశపు మిస్సైల్ క్యాపిటల్‌గా హైదరాబాద్ వెలుగొందుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు మన హైదరాబాద్ నిలయం. అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (KRAS), ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేటు సంస్థలు కూడా భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన కీలకమైన సబ్ సిస్టమ్‌లను ఈ సంస్థలు సప్లై చేస్తున్నాయి.
Also Read :24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఏమైందంటే..
‘ఆపరేషన్ సిందూర్’(Missile Capital) తర్వాత ఈ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఆర్డర్లు మరింత పెరిగినట్లు సమాచారం. ప్రత్యేకించి బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని హైదరాబాద్‌లోని సంబంధిత తయారీదారులకు భారత రక్షణశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయట. వీటి డెలివరీలను వేగవంతం చేసేందుకు వీకెండ్స్‌లో కూడా పనిచేయమని సూచించారట. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమయ్యాక భారత ప్రభుత్వం వారానికోసారి బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల విడిభాగాల డెలివరీలను కోరుతోందని తెలిసింది. ఈ మిస్సైళ్లలో వాడే ప్రొపల్షన్ సిస్టమ్‌లను మన హైదరాబాద్‌లోని సంస్థలే తయారు చేస్తున్నాయి.
Also Read :Kavitha CM Race: సీఎం రేసులోకి కవిత.. కేటీఆర్‌తో పోటీ ఖాయమేనా ?
బీడీఎల్, మిధానీ షేర్ల ధరలకు రెక్కలు
ప్రభుత్వం వైపు నుంచి ఆర్డర్లు పెరుగుతుండటంతో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) షేర్ల ధరలకు మంగళవారం రెక్కలు వచ్చాయి. మే 13న స్టాక్‌మార్కెట్లో బీడీఎల్ షేరు ధర 11 శాతం, మిధానీ షేరు ధర 4 శాతం పెరిగాయి. బీడీఎల్ షేరు 4 రోజుల్లోనే దాదాపు రూ.300 మేర పెరగడం గమనార్హం. ఇక మిధానీ షేరు ధర రూ.11.35 (3.44%) లాభంతో రూ.341.30కు చేరింది.
డ్రోన్,యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కంపెనీలకు సైతం..
హైదరాబాద్‌లో పలు డ్రోన్,యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటితోనూ భారత రక్షణశాఖ అధికారులు సంప్రదిస్తున్నట్లు తెలిసింది. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణులు మరెక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లోనే తయారు చేశారు. ఆపరేషన్ సిందూర్ కోసం కూడా స్పైస్ 2000 క్షిపణులను సిద్ధం చేశారట. అయితే భారత వాయుసేన చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా స్కాల్ప్, హామర్ మిస్సైళ్లను వాడిందట.