Ranganath House : ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్‌కు హైదరాబాద్ నగరంలోని మధురా నగర్‌లో ఇల్లు ఉంది. అయితే ఆ ఇల్లు కూడా బఫర్ జోన్‌లోనే ఉందని ఇటీవల కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎట్టకేలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌లకు అరుదైన గౌరవం
మధురానగర్‌లో తాను ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కొన్ని దశాబ్దాల క్రితం తన తండ్రి కట్టించారని రంగనాథ్(Ranganath House) తెలిపారు. కృష్ణకాంత్ పార్కు దిగువన వేల ఇళ్లు ఉన్నాయని.. వాటన్నింటి తర్వాతే తమ ఇల్లు ఉందని ఆయన చెప్పారు. ఒకప్పటి పెద్ద చెరువునే తదుపరి కాలంలో కృష్ణకాంత్ పార్కుగా మార్చారని తెలిపారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటాక ఉన్న ఇళ్లు ఏవి కూడా బఫర్‌జోన్ పరిధిలోకి రావని ఇరిగేషన్ నిబంధనలు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు. చెరువు కట్టకు కిలోమీటరు దూరంలో తమ ఇల్లు ఉందని చెప్పారు. మధురానగర్‌లోని తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ ప్రచారంలో వాస్తవికత అస్సలు లేదని స్పష్టం చేశారు. తమ ఇంటికి సంబంధించిన మ్యాప్‌లను సైతం రంగనాథ్ ఈసందర్భంగా విడుదల చేశారు.
Also Read :MLC Kavitha : తెలంగాణలో ‘కుల గణన’ కోర్టుల్లో నిలుస్తుందా.. సర్కారు చెప్పాలి : కవిత
ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవలే కీలక ప్రకటన చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు ఉన్నప్పటికీ పర్మిషన్లు ఉంటే వాటిని కూల్చబోమని ఆయన వెల్లడించారు. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్‌ల పరిధిలో ఇక నుంచి నిర్మాణాలు రాకుండా చూసుకుంటామన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణ చాలా బాగుందని ఆయన కొనియాడారు. అక్కడ తాము పర్యటించినప్పుడు ఈవిషయాన్ని గుర్తించినట్లు రంగనాథ్ తెలిపారు. తెలంగాణలోనూ చెరువుల పునరుద్ధరణకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, అలుగు హైట్, విలేజ్ మ్యాప్, లేక్ స్ప్రెడ్ డేటాలను పరిగణనలోకి తీసుకొని చెరువులకు ఎఫ్టీఎల్‌లను ఫిక్స్ చేస్తామని రంగనాథ్ తెలిపారు.