ORR Speed Limit: దూసుకెళ్లొచ్చు..! హైద‌రాబాద్‌ ఓఆర్ఆర్‌పై గ‌రిష్ట వేగం ప‌రిమితి పెంపు

ఔట‌ర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌) పై వాహ‌నాల ప్ర‌యాణ వేగాన్ని పెంచుతున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ వెల్ల‌డించారు.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 08:17 PM IST

ఔట‌ర్ రింగ్ రోడ్డు (ORR) పై వాహ‌నాల ప్ర‌యాణ వేగాన్ని పెంచుతున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ (Arvind Kumar) వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం గంట‌కు 100 కిలో మీట‌ర్ల గ‌రిష్ఠ వేగంతో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి ఉంది. దీనిని 120 కిలో మీట‌ర్ల‌కు పెంచుతున్న‌ట్లు చెప్పారు. అయితే, ఓఆర్ఆర్ పై ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. భ‌ద‌త్రా ప‌ర‌మైన అంశాల‌పై పుర‌పాల‌క శాఖ, ఓఆర్ఆర్ అధికారుల‌తో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం అర‌వింద్ కుమార్ ట్విట‌ర్ వేదిక‌గా ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డు అనేది ఎనిమిది లేన్ల యాక్సెస్ – నియంత్రిత ఫ్రీవే. ప్ర‌తివైపు నాలుగు లేన్‌లు ఉంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి రెండు లేన్‌ల‌లో గ‌రిష్ట వేగ ప‌రిమితి గంట‌కు 100 కిలో మీట‌ర్లు ఉండ‌గా, మూడ‌వ‌, నాల్గ‌వ లేన్‌ల‌లో గ‌రిష్ట వేగ ప‌రిమితి గంట‌కు 80 కిలో మీట‌ర్లు ఉంది. మొద‌టి రెండు లేన్ల‌లో ఇప్పుడు వేగ ప‌రిమితిని గంట‌కు 100 కిలోమీట‌ర్ల‌కు నుంచి గంట‌కు 120 కిలో మీట‌ర్ల వ‌ర‌కు స‌వ‌రించారు. గ‌తంలో ఓఆర్ఆర్ పై వేగ ప‌రిమితిని గంట‌కు 120 కిలో మీట‌ర్ల నుంచి 100 కిలో మీట‌ర్ల‌కు త‌గ్గిస్తూ నోటిఫికేష‌న్ జారీ చేశారు. తాజాగా మ‌ళ్లీ గ‌రిష్ట వేగాన్ని పాత ప‌ద్ద‌తికి పెంచ‌డం గ‌మ‌నార్హం.

హెచ్ఎండీఏ విభాగం అయిన హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్‌), ఓఆర్ఆర్‌లో ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి వేగ ప‌రిమితులు, లేన్ క్ర‌మ‌శిక్ష‌ణ‌ల‌ను అనుస‌రించాల‌ని కోరుతూ ప్ర‌యాణికుల‌కు త‌ర‌చుగా హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంది. ఓఆర్ఆర్ (కోకాపేట్ నుంచి ఘ‌ట్ కేస్‌ర్‌)లో ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డితే ప్ర‌యాణికులు ORR (తారామతిపేట నుండి నానక్రమ్‌గూడ)లో ఏదైనా అత్యవసర పరిస్థితిని నివేదించడానికి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లు 1066 మరియు 105910కి డయల్ చేయవచ్చున‌ని తెలిపింది.

India Road Network : చైనాను దాటేసిన భార‌త్‌..! ప్ర‌పంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వ‌ర్క్ క‌లిగిన రెండో దేశంగా గుర్తింపు