Site icon HashtagU Telugu

HMDA Expansion :హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు.. ‘ఫ్యూచర్ సిటీ’లోకి 56 గ్రామాలు

Hmda Expansion Future City Hyderabad Telangana Cm Revanth Ghmc

HMDA Expansion : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)  పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లను చేర్చింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాల సంఖ్య 1350కి చేరింది.  మొత్తం మండలాల సంఖ్య 104కు, జిల్లాల సంఖ్య 11కు పెరిగింది. మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా చేరాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చామని పేర్కొంది. తద్వారా హెచ్ఎండీఏకు సంబంధించిన భూభాగం మరో 3 వేల చదరపు కి.మీ మేర విస్తరించింది. మొత్తంగా ఇప్పుడు HMDA పరిధిలో 10,472.72 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది.

Also Read :Sun Tan : ఎండలో తిరగడం వల్ల స్కిన్ నల్లగా మారుతుందా..? అయితే ఇలా చేస్తే తెల్లగా మారిపోతారు

ఫ్యూచర్ సిటీ దిశగా.. 

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ‘ఫ్యూచర్‌ సిటీ’ని నిర్మించనుంది. ఇందుకోసం ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేశారు. ఈ అథారిటీకి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో ఉన్న 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్ సిటీ పరిధిని నిర్ణయించారు. ఓఆర్‌ఆర్‌ అవతలి వైపు ఉన్న ప్రాంతాలు, శ్రీశైలం జాతీయ రహదారి- నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి తెచ్చారు.  ఫ్యూచర్‌సిటీ కోసం ఎంపిక చేసిన 56 గ్రామాల్లోని  36 గ్రామాలు గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండేవి. తాజాగా వాటిని ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)కి బదిలీ చేశారు.

Also Read :Tamarind : చింతపండు వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు..తెలిస్తే వదిలిపెట్టారు

‘ఫ్యూచర్‌ సిటీ’లోని గ్రామాలివే..