Operation DK : టీ కాంగ్రెస్ లోకి ష‌ర్మిల, ప్ర‌క్షాళ‌న‌కు`డీకే` అడుగులు?

Operation DK : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏమి జ‌రుగుతుంది? తుమ్మ‌ల‌ను ఎందుకు పొంగులేటి ఆహ్వానించారు?ష‌ర్మిల‌ను తీసుకోవాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నం

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 03:38 PM IST

Operation DK : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏమి జ‌రుగుతుంది? తుమ్మ‌ల‌ను ఎందుకు పొంగులేటి ఆహ్వానించారు? ష‌ర్మిల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని ఆయ‌న ఎందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  కాంగ్రెస్ లోని ఒక గ్రూపుకు  ఏ మాత్రం ఇష్టంలేని ష‌ర్మిల‌ను తెలంగాణ కాంగ్రెస్ లోకి తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ‌తాయ‌న్న చ‌ర్చ వినిపిస్తోంది. అంతేకాదు, ష‌ర్మిల‌ను ఆహ్వానిస్తూ ఒక టీమ్, వ‌ద్దంటూ మ‌రో టీమ్ గా కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నా, అధిష్టానం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ (Operation DK) ద్వారా న‌డుపుతోంది. ఆయ‌న‌దే ఫైన‌ల్ నిర్ణ‌యం అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ష‌ర్మిల‌ను ఆహ్వానిస్తూ ఒక టీమ్, వ‌ద్దంటూ మ‌రో టీమ్ (Operation DK)

కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రెవ‌రికి ఎక్క‌డ లాబీయింగ్ ఉంది? అనేది తెలుసుకోవ‌డం క‌ష్టం. స‌ముద్రంలాటి ఆ పార్టీలో ఎక్క‌డో ఒక చోట చ‌క్రం తిరిగిపోతుంది. ఒక మాత్రన‌ ఆ పార్టీలోని రాజ‌కీయం అంతుబ‌ట్ట‌దు. ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి టీమ్ అంతా ఏకం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ క్ర‌మంలో ష‌ర్మిల‌ను ఆ టీమ్ ఆహ్వానిస్తోంది. ప్ర‌త్యేకించి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ త‌రువాత కొంత కాలానికి ష‌ర్మిల పార్టీ విలీనం ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇదంతా డీకే శివకుమార్ కు (Operation DK) తెలియ‌కుండా జ‌రిగిన ప‌రిణామాలు కాద‌ని భావించాలి. ఎందుకంటే, వైఎస్ కుటుంబంతో డికే సాన్నిహిత్యం కొన్ని ద‌శాబ్దాల క్రితం నుంచి కొన‌సాగుతోంది.

రాబోవు రోజుల్లో ష‌ర్మిల‌ను కాంగ్రెస్ తెలంగాణ విభాగంలో కీల‌కం

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉండ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాపారాలు బెంగుళూరు కేంద్రంగా ఉండేవి. ఆప్ప‌ట్లో డీకే శివ‌కుమార్ తో క‌లిసి ఆ వ్యాపారాలు ఉండేవ‌ని కూడా టాక్ ఉండేది. హైద‌రాబాద్ కంటే బెంగుళూరు కేంద్రంగా వైఎస్ కుటుంబం ఆస్తులు, వ్యాపారాలు, అంత‌స్తులు ఉన్నాయ‌ని చెబుతుంటారు. అవన్నీ డీకే శివ‌కుమార్ తో  (Operation DK) క‌లిసి కూడ‌బెట్టిన‌వేనంటూ కాంగ్రెస్ వ‌ర్గాల్లోని వినికిడి. అందుకే, వైఎస్ ఆర్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడుగా ఉన్న సూర్యుడు కూడా శివ‌కుమార్ కు బాగా స‌న్నిహితంగా ఉంటాడు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో డీకే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించార‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు చెప్పుకుంటారు. ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, డీకే ఇద్ద‌రూ కుబేరులు అయ్యార‌ని బెంగుళూరు కేంద్రంగా చెప్పుకుంటారు. అంత‌టి సాన్నిహిత్యం వైఎస్ కుటుంబంతో ఉన్న డీకే శివ‌కుమార్ రాబోవు రోజుల్లో ష‌ర్మిల‌ను కాంగ్రెస్ తెలంగాణ విభాగంలో కీల‌కంగా చేస్తార‌ని భావించ‌డంలో ఎలాంటి సందేహం ఉండ‌దు.

Also Read : Sharmila Plan : `DK` మార్క్ పాలిట్రిక్స్ ! ష‌ర్మిల‌తో కాంగ్రెస్ జోడీ?

ఒక వ్యూహం ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ‌లో అడుగులు వేస్తోంది. ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన త‌రువాత తెలుగు రాష్ట్రాల్లో న‌ష్టపోయిన పార్టీకి మ‌రోసారి అలాంటి అనుభ‌వం రాకుండా చూసుకుంటోంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోయింది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్ర‌స్తావించారు. వైఎస్ మ‌ర‌ణానంత‌రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స‌రిగ్గా డీల్ చేయ‌లేక కాంగ్రెస్ న‌ష్ట‌పోయింద‌ని ఇటీవ‌ల ఆయ‌న చెప్పుకొచ్చారు. పైగా సీనియ‌ర్లు ప్ర‌స్తుతం వ్యూహాత్మ‌కంగా మౌనాన్ని పాటిస్తున్నారు. రాజ‌కీయంగా ఉప్పు నిప్పులా ఉండే పొంగులేటి, తుమ్మ‌ల ఖ‌మ్మం వేదిక‌గా చేతులు క‌లిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇదో పెద్ద ప‌రిణామం. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇంటికి పొంగులేటి వెళ్లి ఆహ్వానించ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. తానే తుమ్మ‌ల‌ను ఆహ్వానిస్తున్నానంటూ మీడియాముఖంగా ప్ర‌క‌టించ‌డం వ్యూహాత్మ‌కం. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే,ఊహించ‌లేని ప‌రిణామం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జ‌ర‌గ‌బోతుంద‌ని భావిస్తున్న వాళ్లు లేక‌పోలేదు.

 Also Read : Congress Groups : తెలంగాణ కాంగ్రెస్ లో `ఉద‌య్ పూర్` క‌ల్లోలం!

కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేరిన త‌రువాత ప‌రిణామాలు వేగంగా మారే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేశారు. ఉత్త‌ర తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో మిన‌హా ఆమెకు ద‌క్షిణ తెలంగాణ‌లో ప‌ట్టు ఉంద‌ని ఆమె వ‌ర్గీయుల అభిప్రాయం. అంతేకాదు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తెగా ష‌ర్మిల‌ను ఆహ్వానిస్తామ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జ‌గ్గారెడ్డి, వీ హనుమంత‌రావు త‌దిత‌రులు చెబుతున్నారు. స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మావోడేనంటూ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ట్వీట్ కూడా చేశారు. అంటే, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఉన్న క‌రిష్మాను ష‌ర్మిల రూపంలో పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగంలోకి అడుగు పెడుతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఆ పార్టీలో జ‌రిగే ప్ర‌తి పరిణామం ఆస‌క్తిక‌ర‌మే.