One State One RRB : ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బీ’.. సాకారం దిశగా కేంద్ర ఆర్థికశాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆర్‌ఆర్‌బీ అంటే రీజియనల్ రూరల్ బ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వంటి వాటిని రీజియనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. వీటి విలీనానికి సంబంధించిన మూడు విడతలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఖర్చుల నియంత్రణ, సమర్ధవంతమైన నిర్వహణ, అత్యుత్తమ ఫలితాల కోసం ఆర్‌ఆర్‌బీల నాలుగో విడత విలీన ప్రక్రియను తాజాగా కేంద్ర సర్కారు మొదలుపెట్టింది.
Also Read :Reverse Image Search : ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ఫీచర్.. మార్ఫింగ్ ఫొటోలకు వాట్సాప్ చెక్
- మన దేశంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు లోన్లు ఇవ్వడానికి ఆర్‌ఆర్‌బీ చట్టం 1976 కింద రీజియనల్ రూరల్ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా, స్పాన్సర్ బ్యాంకుకు 35 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా ఉంటుంది.
- 2004-05 ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశంలో 196 రీజియనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవి. 2020-21 నాటికి మూడు విడతల్లో విలీనాల ద్వారా వాటి సంఖ్యను 43కు తగ్గించారు.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 రీజియనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే 15 ఆర్‌ఆర్‌బీలను విలీనం చేయనున్నారు. దీంతో ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి తగ్గిపోతుంది.
- విలీనం కాబోతున్న రీజియనల్ రూరల్ బ్యాంక్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోనివి 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన చెరో 3, బిహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లకు చెందిన చెరో రెండు ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి.
Also Read :Light Motor Vehicle : లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉందా?.. ‘సుప్రీం’ గుడ్ న్యూస్
- ఆంధప్రదేశ్‌లో ఇకపై కెనరా బ్యాంక్ స్పాన్సర్‌షిప్‌తో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(One State One RRB) పనిచేస్తుంది.
- తెలంగాణలో ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్‌షిప్‌తో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పనిచేస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల మధ్య ఆస్తులు, అప్పులు విభజన ఒప్పందాలకు లోబడి ఉంటాయి.