Madhavi Latha : మరోసారి అసదుద్దీన్‌ వర్సెస్ మాధవీలత.. కీలక వ్యాఖ్యలు

Asaduddin..Madhavi Latha: గత కొన్ని రోజులుగా ఎంఐఎం అధినేతకు మాధవీలత మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) హోరేత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. అయితే రామనవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లు మాధవీలత చేసి చూయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది […]

Published By: HashtagU Telugu Desk
Once again Asaduddin vs. Madhavilatha.. Key comments

Once again Asaduddin vs. Madhavilatha.. Key comments

Asaduddin..Madhavi Latha: గత కొన్ని రోజులుగా ఎంఐఎం అధినేతకు మాధవీలత మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) హోరేత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. అయితే రామనవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లు మాధవీలత చేసి చూయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది కాదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తమను బూతులు తిడుతూ.. టెర్రరిస్టులు అంటున్నారని మండిపడ్డారు. హిజాబ్ తీసేయాలని ముస్లిం మహిళలతో అంటున్నారని.. సౌదీలో ఇలాగే జరుగుతోందని చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. ఇక, అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ ‘సబ్ కా సాత్’ ‘సబ్ కా వికాస్’ కోసం హిందువులు, ముస్లింల కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నా అన్నారు.

Read Also: Jogi Ramesh : జోగి రమేష్ కు కుటుంబ సభ్యులే షాక్ ఇచ్చారు..

శ్రీరామ నవమి రోజు తాను గాల్లో బాణం వదిలినట్లు చూయిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి దాన్ని తీసుకొచ్చి ఓ మతపరమైన బిల్డింగ్‌కు చూయించినట్లు చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వీడియో ఎడిట్ చేసి మసీదు వైపు చూయిస్తే తాను ఏం చేయాలన్నారు. ఇలా రెచ్చగొట్టుడే మీ పనా.. దేశం బాగు పడాలని.. ఓల్డ్ సిటీ బాగుపడాలని లేదా అని అసదుద్దీన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇంకో సారి ఇలాంటి వీడియోలు చేసి చెత్త హర్కత్‌లకు పాల్పడితే పతంగి కట్ చేస్తా.. ఊరుకునేది లేదని.. సంచలన వార్నింగ్ ఇచ్చారు.

Read Also: AP Elections Survey : ఇండియా టుడే Vs టైమ్స్ నౌ.. ఏపీ రాజకీయాల్లో చర్చ

కగా, హైదరాబాద్‌లో పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీజేపీ వర్సెస్ ఎంఐఎం డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుతోంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ మరో సారి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి మాధవీలత బరిలో ఉన్నారు.

  Last Updated: 19 Apr 2024, 11:37 AM IST