Site icon HashtagU Telugu

NTRs Birth Anniversary : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులు

Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

NTRs Birth Anniversary :  ఈరోజు (మే 28న)  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు  ఎన్టీఆర్‌ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌‌లు నివాళులు అర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌‌లు  ఒకే కారులో వచ్చారు.  ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించేందుకు ఎంతోమంది ప్రముఖులు ఎన్టీఆర్‌ ఘాట్‌‌(NTRs Birth Anniversary)కు తరలి వస్తున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు ప్రముఖుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఘాట్‌ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు.

Also Read :Investment : కుప్పంలో భారీ కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్ 8 వేల మందికి ఉపాధి

రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఎన్టీఆర్ జయంతి 

ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపై ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొంటూ జీవో‌ను జారీచేసింది. ఎన్టీఆర్‌ అసాధారణ జీవితం, దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై తిరుగులేని ముద్రవేశారని ప్రభుత్వం పేర్కొంది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచారని, ప్రజలకు, సినీ, రాజకీయ రంగాలకు ఎంతో సేవ చేశారని కొనియాడింది.

Also Read :Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!

నందమూరి తారక రామారావు గురించి..