congress: ప్రభుత్వానికి చెందిన అధికారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు బీఆర్ఎస్(brs) పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది.
నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ… pic.twitter.com/qOSbdi8ysc
— BRS Party (@BRSparty) April 18, 2024
అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై.. క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీఆర్ఎస్ ఈ మేరకు ఆరోపించింది.
We’re now on WhatsApp. Click to Join.
నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకోరాదని, సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కానీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో పాల్గొనడం జరిగిందని బీఆర్ఎస్ పేర్కొంది. దీనిపై భారత ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా కోరింది. ఈ క్రమంలోనే వేం నరేందర్ రెడ్డి మాట్లాడిన వీడియో పోస్ట్ చేసింది.
Read Also: Teja Sajja Mirai First Glimpse : తేజా సజ్జా మిరాయ్ గ్లింప్స్.. మాటల్లేవ్ అంతే..!