Site icon HashtagU Telugu

Nursing Student Suicide : నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం..?

Narsing Student

Narsing Student

Nursing Student Suicide in Gachibowli Redstone Hotel : హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ( Gachibowli Redstone Hotel) నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరేసుకుని (Nursing Student Suicide) చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు (Rep and Murder) పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంలో హత్యలు , అత్యాచారాలు , దోపిడీలు , మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు , పోలీసులు ఎక్కడిక్కడే నిఘా పెట్టి కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ నేరాలు మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట హత్యాచారం , హత్య అనే ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ఫై విమర్శలకు దిగుతున్నాయి.

తాజాగా ఈరోజు మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్‌ హోటల్‌ రూమ్‌లో ఓ యువతి ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని శృతిగా గుర్తించారు. అయితే గదిలో అంతా రక్తపు మరకలు, మందు బాటిళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, మృతురాలి బంధువులు హోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. శృతి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. తమ బిడ్డపై లైంగికదాడి చేసి, అనంతరం ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.450 నుంచి రూ.27లక్షలు