Telangana Jobs : కోర్టుల్లో జాబ్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ల కోసం యువత ఆతుర్తగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. తెలంగాణలోని వివిధ కోర్టులు, తెలంగాణ న్యాయశాఖ, సబార్డినేట్ సర్వీసులలో 1673 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ దాకా విద్యార్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పకుండా అవసరం. 18 నుంచి 34 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అయితే వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
Also Read :Sonu Vs Salman : సల్మాన్ ఖాన్‌పై సోనూ సూద్ సంచలన కామెంట్స్
1461 పోస్టులు..
హైకోర్టు భర్తీ చేయనున్న 1673 పోస్టుల విషయానికొస్తే.. వీటిలో 1461 పోస్టులు తెలంగాణ న్యాయశాఖ, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో ఉన్నాయి. ఇందులో నాన్ టెక్నికల్ పోస్టులు 1277, టెక్నికల్ పోస్టులు 184. ఈ విభాగాల్లో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III వంటి పోస్టులు ఉన్నాయి.
212 పోస్టులు..
హైకోర్టు భర్తీ చేయనున్న 1673 పోస్టులలో అత్యధికంగా 212 పోస్టులు హైకోర్టుకు(Telangana Jobs) సంబంధించినవే. వీటిలో అత్యధికంగా 75 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. 42 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 24 ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి. 20 సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. 16 కాపీయిస్ట్ పోస్టులు ఉన్నాయి. 12 కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటెరీస్ పోస్టులు, 12 టైపిస్టు పోస్టులు, 11 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
Also Read :Worlds Oldest Person : ప్రపంచంలోనే వృద్ధ మహిళ ఇక లేరు.. 116 ఏళ్ల బామ్మ తుదిశ్వాస
ఈ పోస్టులకు జనవరి 8వ తేదీని నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించొచ్చు. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.600. అయితే ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.400 మాత్రమే. జనవరి 31లోగా అప్లికేషన్లు సమర్పించాలి. టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్‌లో.. నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ నెలలో పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివన్నీ చేసి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.