Site icon HashtagU Telugu

Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి గా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

 

Rajya Sabha: రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర(Vaviraju Ravichandra)పేరును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(kcr) బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథంలో ఈరోజు రాజ్యసభ(Rajya Sabha) స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గురువారం నామినేషన్‌(Nomination)దాఖలు చేశారు. ఈనామినేషన్‌ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(ktr), బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా(Rajya Sabha member) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనున్నది. మొదటి దఫాలో దాదాపు రెండేళ్లు సభ్యుడిగా కొనసాగారు. 2022లో అప్పటి బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇటీవల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనున్నది. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ఆయనకు రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు.

read also : Astrology: ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. నరదృష్టితోపాటు ఆ సమస్యలన్నీ పరార్?