New Year Celebrations: నో పబ్స్.. ఓన్లీ ఫామ్ హౌజ్ పార్టీస్!

పబ్స్ అండ్ బార్స్ ను ఇష్టపడే యువత ఈసారి మాత్రం డిఫరెంట్ గా న్యూ ఇయర్ (New Year) ను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
New Year Celebreations

New Year

నూతన సంవత్సరం (New Year) 2023కి గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ (Hyderabad) లోని పబ్‌లు, క్లబ్‌లు వేడుకులకు సంబంధించిన ప్రిపరేషన్స్ వారం రోజుల ముందునుంచే మొదలుపెట్టాయి. అయితే సిటీలో ఉండే చాలామంది పబ్బులకు వెళ్లడానికి ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి మొదలైన నేపథ్యంలో పబ్స్ కు వెళ్లడానికి ఇష్టం చూపడం లేదు. ఒకవైపు రద్దీ, మరోవైపు ఖర్చులు విపరీతంగా ఉండటంతో యువత పబ్స్ కంటే ఇతర వాటి కోసం ప్లాన్ వేస్తున్నారు.

ఇష్టమైన ప్రదేశాల్లో

పార్టీ కల్చర్ గుడ్ బై చెబుతూ నచ్చిన ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను (New Year) జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిసెంబరులో విమాన ఛార్జీలలో సగటున 30-40 శాతం పెరుగుదలను చూపుతున్నాయి. నచ్చిన వెకేషన్ (Vacation) కు వెళ్లి వేడుకలను జరుపుకోవాలని యోచిస్తున్నారు కొందరు. మార్కెటింగ్ డైరెక్టర్ వరుణ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. చాలామంది పార్టీ ప్యాకేజీతో పాటు స్టే-కేషన్‌లను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. ” ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్స్, ఎలాంటి రద్దీ లేకుండా ఉండటం, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో రిలాక్స్ డ్ గా గడిపేందుకు ఇష్టం చూపుతున్నారు. అందుకే చాలామంది ఇలాంటి రకమైన ప్యాకేజీని ఇష్ట పడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

లాంగ్ డ్రైవ్స్

హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కుర్రాళ్లు, విద్యార్థులు పబ్స్ (Pubs and Bars) కు బదులు ఫామ్‌హౌస్ పార్టీలను సెలక్ట్ చేసుకుంటున్నారు. తగిన స్థలం, స్వేచ్ఛ, తగినంత ఏకాంతం ఉండటంతో ఈరకమైన ప్లేసులను బుక్ చేసుకుంటున్నారు. ఇదే విషయమై కేశవ్ రాజ్‌ విద్యార్థి మాట్లాడుతూ.. తాను  స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్స్ కు వెళ్లేందుకు ప్లాన్ చేశామని, బ్యూటిఫుల్ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకొని న్యూయర్ వేడుకలను (New Year) సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాడు. సిటీలో ట్రాఫిక్, భయంకరమైన రద్దీ, మితిమీరే డీజే సౌండ్స్ దూరంగా ఉండేందుకు పలు ప్యాకేజీల వైపు ద్రుష్టి సారిస్తున్నారు. సిటీ దూరంగా ఓ విల్లాను బుక్ చేసుకొని, అక్కడ అందరూ స్నేహితులు చేరి సరాదాగా గడపడం, చలి మంటలు వేసుకోవడం లాంటివి ప్లాన్ చేసున్నారు మరికొందరు. పలు డిపరెంట్ కాన్సెప్ట్ తో 20223 గ్రాండ్ వెల్ కం చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Janhvi Kapoor: అదిరేటిలో డ్రస్సులో జాన్వీ.. ఫ్యాషన్ ప్రియులు ఫిదా!

  Last Updated: 30 Dec 2022, 12:56 PM IST