Hyderabad Housing : హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్‌పై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో ఇల్లు కొనాలని భావించే వారు ఫస్ట్ ప్రయారిటీ ‘3 బీహెచ్‌కే’కే ఇస్తున్నారని వెల్లడైంది. వరండాతో కూడిన ‘3 బీహెచ్‌కే’ ఉంటే బెటర్ అని జనం చెబుతున్నారట. తాజాగా ‘ఫిక్కీ-అనరాక్ సంస్థ’ నిర్వహించిన సర్వేలో గుర్తించిన ఆసక్తికర వివరాలు ఇవే..
We’re now on WhatsApp. Click to Join
గతంలో హైదరాబాద్‌లో 2 బీహెచ్‌కే ఇళ్లు, ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు 3 బీహెచ్‌కేలకు క్రేజ్ నడుస్తోంది. గతంలో రెండు పడక గదుల ఇళ్లు కొన్నవారు.. ఇప్పుడు మూడు పడక గదులకు మారడం అనేది ఆసక్తికర పరిణామమే. ఆర్థిక స్థోమత పెరగడం వల్లే అంతలా ఖర్చు పెట్టడానికి జనం ఆసక్తిచూపిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తుండటంతో సాధ్యమైనంత పెద్ద ప్రాపర్టీ చేజిక్కించుకోవాలనే తపనలో ప్రజలు ఉన్నారు. 2023 సంవత్సరంలో జులై నుంచి డిసెంబరు మధ్య కాలలో ఫిక్కీ అనరాక్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇళ్ల ధరలు చుక్కలను అంటుతుంటాయి. అలాంటి నగరంలోనే ఇప్పటికే 2 బీహెచ్‌కే కొనుగోళ్లే ప్రజల టాప్ ప్రయారిటీగా ఉన్నాయి. ముంబైలో ఇళ్లు కొంటున్న వారిలో 44 శాతం మంది.. 2 బీహెచ్‌కేను కొనేందుకు మొగ్గుచూపుతుండటం గమనార్హం. మన హైదరాబాద్‌లో(Hyderabad Housing) అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. పుణె నగరంలోనైతే ఆశ్చర్యకరంగా ఇప్పటికే 1-బీహెచ్‌కే ఇళ్ల అమ్మకాలు కూడా జోరుగానే జరుగుతున్నాయి.
Also Read :BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?
- దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే 2023వ సంవత్సరంలో ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు గత ఏడాదిలో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని హౌసింగ్ డెవలపర్లు ప్రారంభించారు. రూ.40-45 లక్షల శ్రేణి ఇళ్ల నిర్మాణం గతంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా తగ్గింది.
- ఇండ్లు కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు /ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
- 2020 వరకూ చూస్తే.. సిద్ధంగా ఉన్న ఇండ్లు కొనుగోలుకు ఎక్కువ మంది ప్రయత్నించేవారు. ఇప్పుడు నిర్మాణ సంస్థ పేరు, ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశాలు ధ్రువీకరించుకుని, నిర్ణయం తీసుకుంటున్నారని సర్వే పేర్కొంది.
- కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచి పనిచేయడం పెరిగినందున, ఉద్యోగులకు నెలవారీ మిగులు బడ్జెట్ పెరిగింది. ఈ నిధులను పెట్టుబడి పెట్టి, ఇండ్లు కొనుగోలుపై వారు దృష్టి సారిస్తున్నారు అని ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటీ తెలిపింది.