Site icon HashtagU Telugu

MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత

No local elections without 42 percent BC reservation: MLC Kavitha

No local elections without 42 percent BC reservation: MLC Kavitha

MLC Kavitha : బీసీ హక్కుల సాధన కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నడుం బిగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పాటించాలన్న డిమాండ్‌తో జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా రైల్‌ రోకోకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ ఇప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది అని కవిత పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు

బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఒత్తిడికి గురిచేయడానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాస్తున్నామని తెలిపారు. జులై 8లోపు అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో బీసీలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది రాజకీయ ఆందోళన కాదు. ఇది న్యాయ పోరాటం. బీసీలు వందల ఏళ్లుగా తట్టుకుంటున్న వివక్షకు దీని ద్వారా అడ్డుకట్ట వేయాలి అని ఆమె హితవు పలికారు. అలాగే గోదావరి-బనకచర్ల పథకం విషయంలో ప్రభుత్వం తటస్థ వైఖరి అవలంబించడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు.

ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం మౌనంగా ఉండడం అన్యాయం. బీసీ రిజర్వేషన్ల విషయంలో, నీటి ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు అని ఆమె పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తక్షణమే బీసీ హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా పోరాడుతుందని, బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలే ఇప్పుడు వారిని విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. బీసీ హక్కులు, రాజకీయ హస్తక్షేపం, సామాజిక న్యాయం అనే అంశాల్లో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. రైల్‌ రోకోతో తాము మొదలు పెట్టే ఉద్యమం, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఒత్తిడిని పెంచుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇది మొదటి దశ మాత్రమే. అవసరమైతే పార్లమెంట్ ముట్టడి దాకా పోరాటాన్ని తీసుకెళ్తాం అని కవిత హెచ్చరించారు.

Read Also: HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే