తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుందా..? బతుకమ్మ చీరల పంపిణీ (Bathukamma Sarees Distribution)కి ఫుల్ స్టాప్ పెట్టి..ఆ ప్లేస్ లో మరో పథకాన్ని తీసుకరావాలని చూస్తుందా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బిఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ (Bathukamma Sarees ) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకను అందించాలన్న ఉద్దేశ్యంతో అప్పటి సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 225 డిజైన్లకు చేరుకుంది. 2017 నుండి ఈ చీరల పంపిణి అనేది కొనసాగిస్తూ వచ్చారు. అయితే ప్రతిసారి చీరల పంపిణి విషయంలో మహిళలను నిరసనలు తెలుపుతూ వచ్చారు. నాసిరకం చీరలు పంపిణి చేసారని చెప్పి తీసుకోకపోవడం , రోడ్ల ఫై కాల్చేయడం వంటివి చేసారు. ఇదే విషయాన్ని ప్రతి పక్ష పార్టీలు సైతం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చీరల్లో నాణ్యత లేదని..చీరల పంపిణి లో పెద్ద గోల్ మాల్ నడుస్తుందని…ఇదొక స్కామ్ అంటూ ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించింది.
ఇక ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీలో భారీగా గోల్ మాల్ జరిగిందని, వందల కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ..చీరల పంపిణి కార్యక్రమాన్ని నిలిపివేసి, ఆ ప్లేస్ లో మరో స్కీమ్ తీసుకురావాలని భావిస్తోందని తెలుస్తోంది. దీంతో మహిళలకు ఏమైనా బహుమతులు ఇస్తారా? ఆర్థిక సాయం చేస్తారా? అనేది చూడాలి.
Read Also : Gaza School : గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 100 మంది మృతి