Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ లో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ బీఆర్ఎస్ మేయర్‌ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

Shock To BRS: హైదరాబాద్ లో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ బీఆర్ఎస్ మేయర్‌ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సోమవారం ఆమెకు వ్యతిరేకంగా 20 మంది ఓటు వేసినట్లు ఆర్డీఓ ప్రకటించారు.

20 మంది అసమ్మతి కార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి హాజరయ్యారు. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ ఓటింగ్ నిర్వహించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా.. 16వ డివిజన్ కార్పొరేటర్ గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 27 మందిలో 20 మంది మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. అవిశ్వాసానికి అనుకూలంగా 20 మంది ఓటు వేసినట్లు తెలిపారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు . ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జవహర్‌నగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు .

అవిశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో మేయర్ కావ్య కార్పొరేషన్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు అసమ్మతి వాదులు తమ స్వలాభం కోసం ఈ ప్రక్రియకు తెర లేపారు. భూకబ్జాదారులతోపాటు అసమ్మతి వర్గం నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Tata Vs Pakistan : పాక్ జీడీపీని దాటేసిన టాటాగ్రూప్.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా ?