మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు (Telangana People) ఈ బడ్జెట్ ఫై గప్పుడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కోరికలపై ప్రతిసారి బడ్జెట్ నీళ్లు చల్లుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈసారైనా మా కోరికలు తీరేలా బడ్జెట్ ప్రవేశపెడతారో లేదో అని ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ ఆశిస్తుంది. అలాగే పారిశ్రామిక వార్డుల ఏర్పాటు, రాష్ట్రంలో సింగరేణి, ఐఐటి హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు ఏర్పాటు..రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, నవోదయ, సైనిక్ స్కూల్ లను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ప్రజలు కోరుతున్నారు. అలాగే నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
ఇక తెలంగాణ బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి నిధులు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించాలని , కేంద్రం ఇస్తున్న జీఎస్టీ వాటాలను పెంచాలని కోరుతోంది. అలాగే గత మూడు బడ్జెట్లలో రైల్వే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు జరగలేదని, ఈసారి ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి రైల్వే ప్రాజెక్టులలో కేటాయింపులు చేయాలనీ భావిస్తున్నారు. కాజీపేట బల్లార్షా, కాజీపేట విజయవాడ మూడో లైన్ కు కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. భద్రాచలం కొవ్వూరు, రామగుండం మణుగూరు ప్రాజెక్టుల విషయాల్లో కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి కేంద్రం తెలంగాణ ప్రజల కోర్కెలు తీరుస్తుందో..ఎప్పటిలాగా మొండిచెయ్యి చూపిస్తుందో చూడాలి.
Read Also : Budget : ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు