SSC Exam Results: టెన్త్ ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్!

విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి (Sabitha Reddy) టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 01:38 PM IST

తెలంగాణలో (Telangana) విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదోతరగతి ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి (Sabitha Reddy) టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు.

99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ (Nirmal) జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 59.46 శాతంతో వికారాబాద్‌ (Vikarabad) చివరి స్థానంలో నిలిచినట్లు వివరించారు. 25 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదని సబిత చెప్పారు. జూన్‌ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 26లోపు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మంత్రి వివరించారు.

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.

Also Read: NBK108 Update: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!